తెలంగాణ

telangana

ETV Bharat / state

రుయా మృతులు పేర్లు ఇవిగో... ఏపీ ప్రభుత్వానికి సీపీఐ ఛాలెంజ్​ - ap news

తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మంది మాత్రమే మృతి చెందారని ప్రభుత్వం అసత్యం చెబుతోందని.... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మొత్తం 23 మంది చనిపోయారంటూ వారి పేర్లతో సహా వివరాలు తెలిపారు. ఆక్సిజన్ విషయంలో కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోతుందని ప్రశ్నించారు.

ఏపీ వార్తలు
thirupathi ruia

By

Published : May 12, 2021, 5:03 PM IST

ఏపీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మంది మాత్రమే మృతి చెందారని ప్రభుత్వం అసత్యం చెబుతోందని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మొత్తం 23మంది చనిపోయారంటూ వారి పేర్లతో సహా వివరాలు తెలిపారు. ఆక్సిజన్ విషయంలో కేంద్రాన్ని ఏపీ రాష్ట్రప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోతోందని ప్రశ్నించారు.

వైకాపా నేతలకు ఉన్న కల్యాణమండపాలను కొవిడ్ సెంటర్లుగా మార్చుకోవాలని సూచించిన నారాయణ... కేంద్రం మీద పోరాడలేక.. ప్రతిపక్షనేత మీద, వైద్యుల మీద అభాండాలు వేస్తోందని దుయ్యబట్టారు. హిందూపురం, విశాఖ, తిరుపతి, అనంతపురం ఒంగోలులో ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డ వారి విషయంలో ఏమని సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రుయా మృతుల వివరాలకు ఆయన వెల్లడించారు.

రుయా మృతులు పేర్లు ఇవిగో... ఏపీ ప్రభుత్వానికి సీపీఐ ఛాలెంజ్​

నారాయణ చెప్పిన మృతుల వివరాలు...

1. కె.బాలు, తిరుపతి

2. జయచంద్ర, తిరుపతి

3.పి.ఎస్.రామారావు, చంద్రగిరి

4. రమేశ్​ బాబు, చాన్నారెడీ కాలనీ తిరుపతి

5. జి.భువనేశ్వరి బాబు, చిత్తూరు

6. కలందర్,కుక్కలదొడ్డి

7. కె.రమణ ఆచారి, పీలేరు

8. ఎన్ ప్రభాకర్

9. ఎస్ మహేంద్ర

10. ఎస్ షాహిద్

11. గజేంద్ర బాబు, పుంగనూరు

12. పుష్పలత,కలికిరి

13. మహమ్మద్ బాషా, మదనపల్లి

14. వేణుగోపాల్, సదుం

15. గౌడ్ బాషా, పుంగనూరు

16. రాజమ్మ, మేధంవాల పల్లి

17. మాదన్మోహన్ రెడ్డి, కందురు

18. దేవేంద్ర రెడ్డి, ఎర్రవారి పాలెం

19. సుబ్రమణ్యం

20. బి.సులోచన, కలకడ

21. తనుజ రాణి, రేణిగుంట

22. పజులాల్, దామలచేరువు

23. వెంకట సుబ్బయ్య, రాజంపేట

ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉంటే ఎందుకు ప్రభుత్వం అబద్దాలు ఆడాలని ఆయన నిలదీశారు. మృతి చెందిన వారి విషయంలో అబద్దాలు చెబుతున్న ప్రభుత్వానికి మృతుల పేర్ల రూపంలో తాను ఛాలెంజ్ విసురుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అనవసరంగా బయటకొస్తే కేసులే..

ABOUT THE AUTHOR

...view details