దేశంలో లౌకిక వ్యవస్థకు రక్షణ కరవైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రజలు చైతన్యవంతులై లౌకిక వ్యవస్థను రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్ కొండాపూర్ సీఆర్ఆర్ ఫౌండేషన్లో గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
'దేశం లౌకిక వ్యవస్థకు రక్షణ కరవు' - Cpi narayana updates
హైదరాబాద్ కొండాపూర్ సీఆర్ఆర్ ఫౌండేషన్ లో గాంధీ జయంతి వేడుకల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
'దేశం లౌకిక వ్యవస్థకు రక్షణ కరవు'
దేశంలో మహిళల పట్ల దాడులు విపరీతంగా పెరిగాయని నారాయణ ఆవేదన వెలిబుచ్చారు. మహిళలను రక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు.