CPI Narayana: పంజాబ్ ముఖ్యమంత్రి ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పలు దఫాలుగా ఎన్నికైన వారికి దాని ప్రకారం పింఛన్‌ను లెక్కించి ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం ఒక్కొక్కరికి 4 నుంచి 5 లక్షల పింఛన్ వస్తోందన్నారు. అదంతా వృథానే అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇచ్చే పింఛన్ అంతా వృథానే: సీపీఐ నారాయణ - telangana news
CPI Narayana: ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పలు దఫాలుగా ఎన్నికైన వారికి దాని ప్రకారం పింఛన్‌ను లెక్కించి ఇవ్వడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇచ్చే పింఛన్ అంతా వృథానే: సీపీఐ నారాయణ
ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసేవాళ్లు కోట్లు ఖర్చుపెట్టి పోటీ చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి పదవి విరమణ అనంతరం పింఛన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారికి ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని.. అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బు వృథా కాకుండా.. సంక్షేమ కోసం, విద్యార్థుల చదువు కోసం వినియోగిస్తే బాగుంటుందన్నారు.
ఇదీ చదవండి: