కరోనా వైరస్‌పై రైతులు వ్యవసాయ కూలీలు, పట్టణ ప్రాంతంలో ఉన్న పేదవారిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అవగాహన కల్పించారని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత ఆరోగ్య తీవ్రతను ప్రైవేటు లేబొరేటరీల పాలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
'కరోనా కట్టడిలో వారి పాత్ర కీలకమైనది' - corana updates in telangana
కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాగ్దానాలు అమలు చేసినట్లయితే ధన్యుడవుతాడని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. కరోనా నియంత్రణ కోసం పాటుపడుతున్న పోలీసు, వైద్య, మున్సిపల్ తదితర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వైరస్ కట్టడిలో వారి పాత్ర కీలకమైనదని తెలిపారు.
'కరోనా కట్టడిలో వారి పాత్ర కీలకమైనది'
గాంధీ ఆస్పత్రి తరహా ప్రభుత్వ ఆస్పత్రులను జిల్లా స్థాయి వరకు విస్తరించి బలపరిచేందుకు తగిన ప్రణాళికలు చేయాలన్నారు. గృహ నిర్బంధం ఉన్న వారి కాలక్షేపం కోసం కళాకారులతో ప్రత్యేక కార్యక్రామాలు నిర్వహించి వాటిని టీవీల ద్వారా ప్రచారం చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:ప్రజలు ఆకలితో అలమటించొద్దు: కేసీఆర్