తెలంగాణ

telangana

ETV Bharat / state

CPI Narayana: కంగనా ఓ విలాసవంతమైన బిచ్చగత్తె... సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు - కంగన రనౌత్ వ్యాఖ్యలపై నారాయణ

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్(Bollywood's queen Kangana Ranaut)​పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana comments on Kangana Ranaut). స్వాతంత్ర్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. ఆమెకు పద్మశ్రీ ఇచ్చిన భాజపా(BJP)పైనా నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్యం గురించి మాట్లాడే అర్హత కంగనాకు లేదని, చివరికి ఆమెకు అవార్డు ఇచ్చిన భాజపాకు సైతం లేదన్నారు. కంగనా రనౌత్ ఓ విలాసవంతమైన బిచ్చగత్తె(Kangana Is A Luxurious Beggar) అంటూ వ్యాఖ్యానించారు.

CPI NARAYANA
కంగనా వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ

By

Published : Nov 11, 2021, 10:58 PM IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Bollywood's queen Kangana Ranaut) వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(cpi narayana) తప్పుబట్టారు. దేశానికి 1947లో వచ్చిన స్వాతంత్ర్యం భిక్ష అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా అధికారంలోకి వచ్చిన 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆమె వ్యాఖ్యల(CPI Narayana comments on Kangana Ranaut)పై మండిపడ్డారు. కంగనా ఒక విలాసవంతమైన యాచకురాలు(Kangana Is A Luxurious Beggar) అంటూ విమర్శించారు.

ఆమెకు పద్మ శ్రీ అవార్డు(Padma Shree award) ఎలా వచ్చిందో అందరికీ తెలుసునని నారాయణ (cpi narayana) పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంపై మాట్లాడే అర్హత ఆమెకు పద్మశ్రీ ఇచ్చిన భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌(BJP, RSS)లకు కూడా లేదన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని(PM Narenda Modi) అయ్యాకే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పడం ఆమె బానిసత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తన్నట్లు తెలిపారు. ఆమె తక్షణమే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) హెచ్చరించారు.

విలాసవంతమైన యాచకురాలు(Kangana Is A Luxurious Beggar) ఎవరంటే ఇటీవలే పద్మశ్రీ అవార్డు(Padma Shree award) తీసుకున్న కంగనా రనౌత్. ఆమె కళాకారిణి.. కళామతల్లికి సేవ చేస్తోంది. ఆమెకు పద్మశ్రీ(Padma Shree award) ఎందుకిచ్చారో అర్థమైంది. ఆమెకు స్వాతంత్ర్య పోరాటం గురించి ఆమెకు తెలియదు. భాజపా, ఆర్ఎస్ఎస్​లకు అసలు తెలియదు. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం భిక్ష అని.. నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందనడం అంతకంటే బానిసత్వం మరొకటి లేదు. నువ్వు అడుక్కుంటే అడుక్కో అంతే కానీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే అర్హత మీకు గానీ.. మీకు బిరుదు ఇచ్చిన వారికి కూడా లేదు. ఇంతకు మించిన దరిద్రం మరొకటి లేదు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె తప్పకుండా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.- నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

  • వరుణ్ గాంధీ స్పందించారిలా...

కంగన వ్యాఖ్యలపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ సైతం స్పందించారు. ఆమె మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. "భాజపా నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లోనే భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం లభించింది" అని వ్యాఖ్యానించారు. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం 'భిక్ష' మాత్రమేనని అభిప్రాయపడ్డారు. అలా వచ్చినదాన్ని స్వేచ్ఛ అంటామా? అని ప్రశ్నించారు. "1947లో మనకు లభించిన స్వాతంత్ర్యం బ్రిటిష్ వారి పాలనకు పొడిగింపు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటల్ని భాజపా ఎంపీ వరుణ్ గాంధీ(varun Gandhi) తీవ్రంగా తప్పుబట్టారు. "ఇలాంటి ఆలోచనను పిచ్చితనం అనుకోవాలా? లేక దేశద్రోహంగా భావించాలా?" అంటూ మండిపడ్డారు.

ఇదీ చూడండి:

'2014లోనే దేశానికి అసలైన స్వాతంత్ర్యం'.. కంగన వ్యాఖ్యలపై దుమారం

ABOUT THE AUTHOR

...view details