పదిహేను రోజుల పాటు జరగాల్సిన పార్లమెంట్ సమావేశాలను అర్థాంతరంగా వారం రోజులకే ముగించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పార్లమెంట్‌లో 48 బిల్లులపై చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించారని దుయ్యబట్టారు. బిల్లులపై చర్చ జరగకుండా ఎందుకు ఆమోదించారో... ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
'సభలో గొంతు విప్పనీయకుంటే ప్రభుత్వం ఎందుకు' - మోదీ సర్కారుపై నారాయణ కామెంట్స్
పార్లమెంట్‌లో 48 బిల్లులపై చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించారని దుయ్యబట్టారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిల్లులపై చర్చ జరగకుండా ఎందుకు ఆమోదించారో... చెప్పాలని డిమాండ్ చేశారు.
'సభలో గొంతు విప్పనీయకుంటే ప్రభుత్వం ఎందుకు'
వ్యవసాయ రంగాన్ని మొత్తం బానిసగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను బయట ఆందోళనలు చేయనివ్వడం లేదని.. సభలో గొంతు విప్పనీయనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తీరును సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
ఇదీ చూడండి: ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాస్తులు రూ. 70 కోట్లు!