ఓయూలో విద్యార్థి సురేష్ యాదవ్పై బాల్క సుమన్ అనుచరుల దాడిని ఖండిస్తూ సీపీఐ జాతీయ నాయకులు నారాయణ ఆ విద్యార్థిని పరామర్శించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు సురేష్ యాదవ్కు తగిలిన గాయాలను పరిశీలించారు.
ఆ దాడి వెనుక ప్రభుత్వ హస్తం ఉంది: నారాయణ - ఓయూలో విద్యార్థిపై దాడిని ఖండించిన నారాయణ
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సురేష్ యాదవ్పై బాల్క సుమన్ అనుచరుల దాడిని సీపీఐ నాయకులు నారాయణ ఖండించారు. ప్రభుత్వమే ఆ దాడి చేయించిందని ఆరోపించారు. సురేష్ యాదవ్కు తగిలిన గాయాలను పరిశీలించి ఆయనను పరామర్శించారు.
ఆ దాడి వెనుక ప్రభుత్వ హస్తం ఉంది: నారాయణ
సురేష్ యాదవ్పై దాడికి తెగబడ్డ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ దాడి ప్రభుత్వమే చేయించిందని ఆరోపించారు.
ఇదీ చూడండి :లైవ్ వీడియో: ఆడుకుంటున్న చిన్నారిని ఢీకొట్టిన కారు