తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలాలపై అక్రమ నిర్మాణాలే నగరానికి ముప్పు: నారాయణ - హైదరాబాద్ వార్తలు

భారీ వర్షానికి హైదరాబాద్ నగరం మునిగిపోవడానికి ప్రధాన కారణం నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జేఎన్టీయూ సర్వే చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎంఐఎంతో ప్రభుత్వానికి సఖ్యత ఉండడం వల్లే వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

CPI NARAYANA COMMENTS ON GOVT ACTION IN NON PERMITTED CONSTRUCTIONS IN HYDERABAD
నాలాలపై అక్రమ నిర్మాణాలే నగరానికి ముప్పు: నారాయణ

By

Published : Oct 15, 2020, 10:58 PM IST

రాజధానిలో నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే వరద ముంపునకు గురయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. నిజాం కాలంలోనే వికారాబాద్ నుంచి ఇబ్రహీపట్నం వరకు నాలా ఉండేదన్నారు. అక్రమ కట్టడాలు వరద నీరు పోయేందుకు అటంకంగా మారాయన్నారు. ప్రభుత్వానికి ఎంఐఎంతో దోస్తీ వల్ల వాటి జోలికి వెళ్లడం లేదని బహిరంగంగా విమర్శించారు. 2002లో కిర్లోస్క్​ర్, 2007లో ఓయన్స్ కంపెనీలు వాటిపై సర్వే నిర్వహించాయన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక జేఎన్టీయూ సర్వే చేసిందని, నాలాల మరమ్మత్తులకు రూ. 12 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిందన్నారు. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు తొలగించకుండా ప్రతిపక్షాలపై నింద వేస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశద్ధి ఉన్నా హైదరాబాద్​తో సహా కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఇదీ చదవండి:వ్యాపార సముదాయాలను నిండాముంచిన భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details