తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏదైనా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడుతా: నారాయణ - Cpi latest updates

సామాజిక మాధ్యమాల్లో దొంగ అకౌంట్లతో తనపై దుష్ప్రచారం చేస్తూ కుట్రలు పన్నుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పరోక్ష పద్ధతిలో తనపై అసత్య ప్రచారాలు చేయడాన్ని ఆయన ఖండించారు.

ఏదైనా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడుతా: నారాయణ
ఏదైనా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడుతా: నారాయణ

By

Published : Jan 24, 2021, 5:10 AM IST

తన పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్​తో అసత్య ప్రచారాన్ని చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్​ను విమర్శించినట్లు... అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్విటర్​లో ప్రస్తావించినట్లు ఫేక్​ అకౌంట్​లో ఎవరో పోస్టు చేసినట్లు పేర్కొన్నారు.

దొంగ అకౌంట్లతో తనపై దుష్ప్రచారం చేస్తూ కుట్రలు పన్నుతున్నారని నారాయణ మండిపడ్డారు. ఏదైనా ఉంటే ముక్కు సూటిగా మాట్లాడుతానని... పరోక్ష పద్ధతిలో తనపై అసత్య ప్రచారాలు చేయడాన్ని ఆయన ఖండించారు.

ఇదీ చూడండి:'కేటీఆర్ సీఎం అయితే మెడికల్ కాలేజీ మొదటికే '

ABOUT THE AUTHOR

...view details