తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇద్దరు కలిస్తే కేంద్రం వల్ల కాదు: నారాయణ

ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణపై జరుగుతున్న ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. దీనిపై మంత్రి కేటీఆర్​ను ఆయన అభినందించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పోరాడితే ప్రైవేటుపరం చేయడం మోదీ వల్ల కాదన్నారు.

cpi narayana appreciate to minister ktr on reaction of vizag steel plant privatization by central govt
ఇద్దరు కలిస్తే కేంద్రం వల్ల కాదు: నారాయణ

By

Published : Mar 11, 2021, 4:19 AM IST

విశాఖ ప్రైవేటీకరణ అంశంపై తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాడితే కేంద్రం వెనక్కి తగ్గుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విశాఖ ఉక్కు కార్మాగార ఉద్యమానికి మంత్రి కేటీఆర్​ మద్దతు పలకడాన్ని ఆయన అభినందించారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే అదే తరహాలో ఖమ్మం జిల్లాలోని మైన్స్ కూడా మాయమైపోతాయన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడాల్సిన అవసరముందని తెలిపారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న నారాయణ దీనిపై కలిసికట్టుగా పోరాడాలని సూచించారు.

ఇద్దరు కలిస్తే కేంద్రం వల్ల కాదు: నారాయణ

ఇదీ చూడండి:శివరాత్రికి సిద్ధమైన రాష్ట్రంలోని ఆలయాలు

ABOUT THE AUTHOR

...view details