ప్రైవేట్ బస్సులకు అనుమతిపై హైకోర్ట్ స్టే ఇవ్వడం అభినందనీయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు మొఖం చూస్తుంటే చాలా అవమానపడినట్లు కనిపించిందని.. 4 కోట్ల ప్రజలు అవమానపడేలా చేసే అధికారం కేసీఆర్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అధికారులకు ఆత్మగౌరవం లేదా.. సీఎం ఆశిస్తున్నట్లు మనసు చంపుకుని ఎందుకు పని చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ పెట్టిన ఎవరూ పోలేదని... కేసీఆర్ నియంతృత్వపు పోకడల వల్ల 50 వేల ఆర్టీసీ కార్మికులు రోడ్లమీద ఉన్నారని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికుల మానసిక ధైర్యం దెబ్బతినేలా కేసీఆర్ అవలంబిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి తలకింద పెట్టి తపస్సు చేసిన వంద శాతం ఆర్టీసీ ప్రైవేటికరణ సాధ్యం కాదన్నారు. కేసీఆర్కు ప్రతిపక్షాలంటే గిట్టదని.. ప్రజాసంఘాలను పట్టించుకోరని విమర్శించారు. కేసీఆర్ తీరు వల్లే ఐఏఎస్ అధికారులు హై కోర్టులో తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య విషయంలో జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని కోరారు. రేపు ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చాడ కోరారు.
మనసు చంపుకుని ఎందుకు పనిచేస్తున్నారు: నారాయణ - సీఎం కేసీఆర్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు
సీఎం కేసీఆర్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హైకోర్టులో ఐఏఎస్ అధికారులు అవమానపడేలా కేసీఆర్ చేశారని నారాయణ ఆరోపించారు. సీఎం ఆశిస్తున్నట్లు మనసు చంపుకుని ఎందుకు పనిచేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.
మనసు చంపుకుని ఎందుకు పనిచేస్తున్నారు: నారాయణ