నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన ప్యాకేజీలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట రెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు.
''కొవిడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం భారత సంపదను దోచిపెడుతుంది. భారతదేశాన్ని కాపాడే రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడమేంటి? ఇస్రో, ఎయిర్‌లైన్స్, మైనింగ్ రంగాలను ప్రైవేట్‌కు అప్పగించడం ఏంటి? ఇది సరైన చర్య కాదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ అన్ని రంగాలను ప్రైవేటీకరణం చేస్తుంది.''