తెలంగాణ

telangana

ETV Bharat / state

'కూనంనేని హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి' - CPI LEADERS STRIKE

మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించి రెండ్రోజులవుతున్నా హెల్త్ బులిటెన్ ఇవ్వకపోవడంపై సీపీఐ నేతలు నిమ్స్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకి దిగారు.

'కూనంనేని హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి'

By

Published : Oct 29, 2019, 3:04 PM IST

త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా... ప్రభుత్వం కర్కశంగా వ్యవహారిస్తోందని సీపీఐ ఆక్షేపించింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును బలవంతంగా అరెస్ట్‌ చేసి నిమ్స్​కు తరలించారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. రెండు రోజుల నుంచి సాంబశివరావు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయకపోవడంపై ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఆందోళన చేస్తున్న సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. సాంబశివరావు హెల్త్‌ బులిటెన్‌ను వెంటనే విడుదల చేయాలని... కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రేపు తలపెట్టిన సకలజనుల సమర భేరితో కేసీఆర్‌ దిగరాకపోతే... ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

'కూనంనేని హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details