CPI Leaders Reaction On BRS: మోదీ హయంలో దేశంలో ప్రమాదకర వాతావరణం నెలకొందని ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న భారత్ రాష్ట్ర సమితిని స్వాగతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్రెడ్డి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
మతతత్వ భాజపాను వ్యతిరేకించేవారిలో కమ్యూనిస్టుల తర్వాత ఆ స్థాయిలో కేసీఆర్ ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ జాతీయ స్థాయి అజెండా ఆకట్టుకునేలా ఉందని చెప్పారు. కేసీఆర్ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నాం
"ప్రజాస్వామ్యం పేరుతోటి అమెరికా తరహాలో అధ్యక్ష పాలన అనేది మోదీలో ఉన్న భావజాలం. అత్యంత ప్రమాదకర పరిస్థితులు దేశంలో కన్పిస్తున్నాయి. ఈ దశలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టడం శుభపరిణామం. వారి విధానాలు వేరు మావిధానాలు వేరు కావచ్చు. కానీ ఇక్కడ ప్రధానాంశం భాజపాను వ్యతిరేకించే వాళ్లలో కమ్యూనిస్టుల తరువాత కేసీఆర్ ఉన్నారు. గుజరాత్ మోడల్ వెనక్కి పోయింది. తెలంగాణ మోడల్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ఇచ్చాం." -కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి:దేశరాజకీయాలను కేసీఆర్ కొత్త మలుపు తిప్పుతారు: పువ్వాడ
ఒకేసారి 108 మంది వీణ వాయిస్తూ అమ్మవారికి స్వరాభిషేకం