ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మరు నిమిషం నుంచే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ... సీఎం కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ త్రీవ స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సీపీఐ 'చలో డీజీపీ కార్యాలయ ముట్టడి' చేపట్టింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్ ముందు ఆ పార్టీనేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి నల్ల దుస్తులు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ పరిరక్షణకై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శాంతి యుతంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తే... అర్ధరాత్రి దొంగల్లా ఎత్తుకెళ్లారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రాన్ని ప్రజలు ఏ విధంగా సాధించుకున్నారో... అదే తరహాలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను సాధించుకుంటారన్నారు. ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లు పరిష్కరించి... సమ్మె విరమింపజేయలని డిమాండ్ చేశారు.
'ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేస్తున్నారు' - TSRTC LATEST NEWS IN TELUGU
సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా... హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్ ముందు సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి నల్ల దుస్తులు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. సాంబశివరావును అర్ధరాత్రి పూట అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు.
CPI LEADERS PROTESTED AGAINST GOVERNMENT AT HIMAYATHNAGAR