తెలంగాణ

telangana

ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు: సీపీఐ

ప్రజలపై ధరల భారం మోపుతున్న భాజపా సర్కారుకు... ఈ మధ్యకాలంలో అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పట్టినగతే భవిష్యత్తులోనూ పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ... సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏఐటీయుసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

By

Published : Jun 1, 2021, 2:47 PM IST

Published : Jun 1, 2021, 2:47 PM IST

తెలంగాణ వార్తలు
చాడ వెంకట్​ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం గత ఏడేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలను మూడు రెట్లు పెంచి కార్పొరేట్ శక్తులను పోషిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్​ చేస్తూ హిమాయత్​నగర్​లోని ఏఐటీయూసీ కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు.

అంతర్జాతీయంగా లేని ధరలు కేవలం భారతదేశంలో మాత్రమే పెంచుకుంటూ పోతుందని విమర్శించారు. ధరల పెరుగుదలతో సామాన్యుడి జీవనం భారంగా మారిందన్నారు. పెంచిన ధరలు తగ్గించకపోతే... సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చాడ హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు అజీజ్ పాష, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బోస్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చూడండి: Viral Video: బాలుడ్ని చావబాదిన మాజీ పోలీస్​

ABOUT THE AUTHOR

...view details