రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాష్ట్రాలపై పెత్తనం కోసం మోదీ ఆరాట పడుతున్నారని విమర్శించారు. కొత్త విద్యుత్ చట్టం రాష్ట్రాల హక్కులను హరించేవిధంగా ఉందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల ప్రజలపై మరింత భారం పడుతోందని తెలిపారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు: నారాయణ - CPI leaders protest
చమురు ధరల పెంపును నిరసనగా సీపీఐ చలో రాజ్‌భవన్ చేపట్టింది. రాజ్‌భవన్ వద్ద నారాయణను, మఖ్దూం భవన్ వద్ద చాడ వెంకట్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ చట్టం రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉంది: నారాయణ
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా... పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు. విద్యుత్ విధానంలో సవరణలు, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సీపీఐ చలో రాజ్‌భవన్ నిర్వహించారు. బైక్‌పై రాజ్‌భవన్ దగ్గరికి వచ్చిన నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్దూం భవన్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:'చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక 'ధూర్త శక్తి''