వలసకార్మికులను స్వస్థలాలకు పంపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ నేతలు ఆరోపించారు. హైదరాబాద్ మక్తాలో వలస కార్మికులను కలిసిన సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి... కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన సీపీఐ - రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ ప్రయత్నం
వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. వలస కార్మికులతో రాజ్భవన్వద్దకు చేరుకున్న సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన సీపీఐ
కార్మికులను వెంటనే ఇంటికి పంపించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వలసకార్మికులను తీసుకుని రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి సమస్యను పరిష్కరించని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని సీపీఐ నేతలు హెచ్చరించారు.
ఇదీ చూడండి:ఇంటర్ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన
Last Updated : May 20, 2020, 3:59 PM IST