తెరాస ప్రభుత్వాన్ని కూల్చగలిగే శక్తి మంత్రులు హరీశ్ రావు, ఈటలకే మాత్రమే ఉందని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. స్పష్టమైన మెజార్టీ ఉన్నా కేసీఆర్ అందుకే అభద్రతాభావంతో భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు. తెరాస నేతలు ఆర్టీసీ విషయంలో సీఎంకు సలహా ఇవ్వాలని... లేదంటే కేసీఆర్తోపాటే మునిగిపోతారని పేర్కొన్నారు.
'ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికి మాత్రమే ఉంది'
కేసీఆర్ మొండి వైఖరితోనే ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగుతోందని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. కార్మికులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
'ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికి మాత్రమే ఉంది'
ప్రభుత్వ మొండి వైఖరితోనే ఆర్టీసీ సమ్మె నడుస్తోందని.... విలీనం డిమాండ్ వాయిదా వేసుకుంటున్నామని చెప్పినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం తగదన్నారు. ముఖ్యమంత్రి నియంతలా మారి.. 50 వేల కుటుంబాలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. ఆర్టీసీని విధ్వంసం చేసేందుకు చూస్తున్న సీఎం దీనికి మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు.
ఇవీచూడండి: రేపటి సడక్ బంద్ వాయిదా: అశ్వత్థామరెడ్డి
TAGGED:
Cpi Leaders fires on CM KCR