యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ నాయకులు మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి కారణమైన ఆలయ ఈవో గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆమె పదవీ కాలం ముగిసి ఏడాది గడుస్తున్నా పైరవీలతో ఇంకా కొనసాగుతున్నారని ఆరోపించారు.
యాదాద్రిలో మౌలిక సదుపాయాలపై హెచ్ఆర్సీకీ ఫిర్యాదు - మౌలిక సదుపాయాలపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన సీపీఐ నాయకులు
యాదాద్రిలో భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని సీపీఐ నాయకులు హెచ్ఆర్సీకీ ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధాకర్ మండిపడ్డారు. మహిళా భక్తులు స్నానాలు చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించాలని 2016 నుంచి జిల్లా కలెక్టర్కు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని యాదగిరిగుట్ట సీపీఐ మండల కార్యదర్శి బబ్బురి శ్రీధర్ అన్నారు. దేవస్థానంలో భక్తుల సౌకర్యాలను గాలికొదిలేసిన ఈవో గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు. భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేశారు.