తెలంగాణ

telangana

ETV Bharat / state

సీజేఐని కలిసిన సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్​రెడ్డి - హైదరాబాద్​ తాజా వార్తలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకట్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దశాబ్దాల తరబడి విచారణకు రాకుండా ఉన్న పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

CPI leaders Chada Venkat Reddy, Narayana met the CJI
సీజేఐని కలిసిన సీపీఐ నేతలు చాడ వెంకట్​రెడ్డి, నారాయణ

By

Published : Jun 18, 2021, 9:53 AM IST

దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల కేసులు, రాజ్యాంగ ఉల్లంఘనల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకట్‌ రెడ్డి... సీజేఐ ఎన్వీ రమణను కోరారు. హైదరాబాద్​ రాజ్‌భవన్​లో భారత ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

దేశంలో లౌకిక వ్యవస్థను కాపాడాలని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణను కోరారు. దశాబ్దాల తరబడి విచారణకు రాకుండా ఉన్న పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి రాసిన రేకొండ గ్రామీణ స్థితిగతులు పుస్తకాన్ని సీజేఐకి అందజేశారు.

ఇదీ చదవండి: ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం

ABOUT THE AUTHOR

...view details