Distribution of gifts by Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టిన పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఉపాధ్యాయులకు కానుకల్ని పంచే పనిని వేగవంతం చేశారని ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థ నడుపుతున్న ఆయనపై ఇప్పటికే బోగస్ ఓట్లు నమోదు చేయించారనే విమర్శలు ఉన్నాయి.
ఎన్నికల షెడ్యూల్ విడుదలై 24 గంటలు కాకముందే శుక్రవారం జిల్లా వ్యాప్తంగా టిఫిన్ బాక్సులు పంపిణీ మొదలు పెట్టగా సీపీఐ, విద్యార్థి సంఘాల నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయినా శనివారం తాయిలాల పంపిణీ యత్నాలు కొనసాగాయి. కడప శివారు రామరాజుపల్లిలోని నాగార్జున పాఠశాలలో భారీగా బాక్సులను సీపీఐ నాయకులు గుర్తించారు. వాహనాల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాటిపైన పోలీసులకు సమాచారం అందించారు.