తెలంగాణ

telangana

ETV Bharat / state

'గుడి తలుపులు మూసివేసి.. మద్యం దుకాణాల తలుపులు తెరిచారు' - హైదరాబాద్​ తాజా వార్తలు

లాక్​డౌన్​ కాలంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంలై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి తలుపులు మూసివేసి మద్యం దుకాణాల తలుపులు తెరిచారని ఆక్షేపించారు.

cpi leader narayana at wine shop
'గుడి తలుపులు మూసివేసి.. మద్యం దుకాణాల తలుపులు తెరిచారు'

By

Published : May 13, 2020, 2:14 PM IST

మద్యం దుకాణాలు తెరవటం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దేవాలయాలను మూసివేసి... మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.

హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో తితిదే దేవాలయాన్ని సందర్శించిన అనంతరం... స్థానికంగా ఉన్న ఓ వైన్స్‌ షాపు వద్ద నిరసన తెలిపారు. ఇప్పటివరకు విధించిన లాక్‌డౌన్‌ వృథా అవుతోందని పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేస్తామని చెబుతున్న పాలకులు ఆచరణలో చూపించడం లేదని విమర్శించారు.

'గుడి తలుపులు మూసివేసి.. మద్యం దుకాణాల తలుపులు తెరిచారు'

ఇదీ చూడండి:కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్​ దాడులు

ABOUT THE AUTHOR

...view details