CPI Leader Narayan on Congress Government :సీపీఐ పొత్తు వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల మెజార్టీకి సీపీఐ ఓట్లు దోహదం చేశాయని తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీనిని గుణపాఠంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తామని అనడం మంచిది కాదు : కూనంనేని
'వామపక్ష తీవ్ర వాదాన్ని అణచాలన్న ప్రభావం సీపీఐపై పడింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడిపోయింది. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టే కాంగ్రెస్ విజయం సాధించింది. ఇండియా కూటమి ఎంత అవసరమో, కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడం కాంగ్రెస్‌కు అంతే ముఖ్యం' అని నారాయణ అన్నారు.
CPI Narayana on Lok Sabha Elections :అనంతరం లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడారు. కేరళలో 4 స్థానాల్లో, తమిళనాడులో 2, బంగాల్లో 3, బస్తర్‌లోని ఎంపీ సీట్లకు పోటీ చేస్తామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. బతికుండగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాస్‌బుక్‌లో జగన్ ఫొటోలు ఎందుకని, తను శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా అని ప్రశ్నించారు.
CPI Leader Narayan Fires on PM Narendra Modi :పార్లమెంట్‌ను కాపాడలేని ప్రధాని, హోం మంత్రి దేశాన్ని ఏం కాపాడతారనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పార్లమెంట్‌లోకి వెళ్లాలంటే నాలుగు అంచెల భద్రత ఉంటుందని, పొగ బాంబు తీసుకెళ్తుంటే ఎందుకు స్కాన్ కాలేదన్నారు. పొగబాంబు తీసుకెళ్లిన వాళ్లకు విజిటర్స్ పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీనేనని ఆరోపించారు.