ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ వివాదాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
'ఆ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి' - chada venkat reddy repond on land issue
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ వివాదాలపై ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
'ఆ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి'
హాఫీజ్‌పేట భూములకు సంబంధించి అఖిల ప్రియ, కేసీఆర్ సమీప బంధువు ప్రసాద్‌రావుల భూ వివాదం సంచలనం రేకెత్తిందన్నారు. హాఫీజ్‌పేట భూముల్లో అనేక అవకతవకలు జరిగాయని సీపీఐ పదేళ్ల క్రితమే ఆందోళన చేసిందని అన్నారు. అప్పటి నుంచి ప్రభుత్వం తూతూ మంత్రంగా వ్యవహారించిందని చాడా ఆక్షేపించారు.
ఇదీ చూడండి :జాతీయ రహదారిపై పసుపు రైతుల ఆందోళన