CPI Kunamneni Comments on KCR : తెలంగాణ నిర్బంధాలను సహించదని ప్రజానీకం స్పష్టం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణలో కేసీఆర్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఊపిరి ఆడని నిర్బంధాలు ఉండేవని మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రం కోసం పోరాడిన మేధావులను, విద్యార్థులను అరెస్టు చేశారని విరుచుకుపడ్డారు.
CPI Kunamneni On Telangana Election Results 2023 :తెలంగాణ ప్రజానీకంకాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విశ్వసించిందని కూనంనేని తెలిపారు. సీపీఐ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా సీపీఎం పొత్తులో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొందిక బాగా కలిసివచ్చిందని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, కోల్బెల్ట్ ప్రాంతాల్లో మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగూడెంలో సీపీఐ గెలవడాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సీపీఐకి టీడీపీ, సీపీఎం, టీజేఎస్, వైఎస్ఆర్టీపీ పార్టీలు మద్దతు ఇచ్చాయని, అన్ని కమ్యూనిస్టు పార్టీల తరఫున అసెంబ్లీలో తన గొంతును వినిపిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో కేసీఆర్‌ను గెలిపించడానికి జగన్ కుట్ర పన్నారు : సీపీఐ నారాయణ
CPILeader Narayana Latest Comments : రాష్ట్ర టూరిజం శాఖలో వందల కోట్ల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని తగులబెట్టారని విమర్శించారు. నేరపూరిత చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. టూరిజం శాఖ మంత్రికి, ఎండీకి తెలియకుండా వందల కోట్ల అవినీతి జరగదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందరిని కలుపుకోవడం వల్లే విజయం సాధించిందని తెలిపారు.
మార్పు కావాలన్న నినాదాన్ని ఆదరించిన రాష్ట్ర ప్రజలు - ఇక కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో