తెలంగాణ

telangana

ఓల్డ్ మలక్‌పేట్‌ డివిజన్‌లో రీపోలింగ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఓల్డ్ మలక్‌ పేట డివిజన్‌లో పోలింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. గురువారం రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

By

Published : Dec 1, 2020, 11:18 AM IST

Published : Dec 1, 2020, 11:18 AM IST

Updated : Dec 1, 2020, 11:42 AM IST

cpi-demand-postpone-the-old-malakpet-polling-in-ghmc
ఓల్డ్ మలక్‌పేట్‌ డివిజన్‌లో రీపోలింగ్

ఓల్డ్ మలక్‌పేట్‌ డివిజన్‌లో ఓటింగ్ నిలిపివేత

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయిన నేపథ్యంలో రీపోలింగ్‌కు ఎస్ఈసీ నిర్ణయించింది. డివిజన్‌లోని 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గురువారం రీపోలింగ్ జరుగునున్నట్లు ప్రకటించింది.

బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. అభ్యర్థుల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఓల్డ్‌ మలక్‌పేటలో 1, 2, 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిపివేశారు. గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్‌ను ఆపేశారు. బ్యాలెట్ పత్రంలో సీపీఐ అభ్యర్థి ఎదురుగా సీపీఎం గుర్తు ఉండడంతో చాడ ఫిర్యాదు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పోలింగ్ నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఓల్డ్ మలక్‌పేట్‌ డివిజన్‌లో పోలింగ్ నిలిపివేయాలి: సీపీఐ

ఓల్డ్ మలక్‌పేట్‌ 26 డివిజన్‌లో పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. బ్యాలెట్ పత్రంలో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి ఉందని చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఓట్లు గల్లంతయ్యాయని బాధితుల ఆందోళన

Last Updated : Dec 1, 2020, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details