తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువును పొడిగించండి: చాడ - ఎన్నికల ప్రధానాధికారి శశాంక్​గోయల్​ను కలిసిన సీపీఎం నాయకులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించిన ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని మరో 15 రోజులు పెంచాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ను కోరాయి. గడువును పొడిగిస్తారని చాడ వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

cpi, cpm party leaders meet state election officer shashank goyal
ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువును పొడిగించండి: చాడ

By

Published : Nov 2, 2020, 7:26 PM IST

ఈనెల 6వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఓటర్‌ నమోదు కార్యక్రమం ఉందని దానిని మరో 15 రోజులు పెంచాలని కోరుతూ హైదరాబాద్‌ బుద్ధభవన్‌లోని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ ‌గోయల్‌ను సీపీఐ, సీపీఎం కలిసి వినతి పత్రం అందజేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో పాటు సీపీఎం నాయకులు నర్సింగ్‌రావు, వెంకట్‌, శ్రీనివాస్‌, నరసింహారావు తదితరులు ఎన్నికల అధికారిని కలిశారు. ఓటునమోదు పొడగింపుపై ఎన్నికల అధికారి సానుకూలంగా స్పందించారని... కేంద్ర ఎన్నికల కమిషన్​కు లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారని చాడ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని... దానిని దృష్టిలో పెట్టుకొని ఓటర్‌ నమోదు ప్రక్రియను పొడిగించాలని కోరినట్టు పేర్కొన్నారు. ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని పొడిగిస్తారని ఆశాభవం వ్యక్తం చేసిన చాడ... ప్రతి ఒక్కరు 6వ తేదీని చివరి తేదీగా పరిగణించుకొని ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి హెచ్చరిక పంపాలి: జానారెడ్డి

ABOUT THE AUTHOR

...view details