ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని... గ్రేటర్‌లో ప్రశ్నించే గొంతు కరవైందని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగిన వామపక్ష నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ నుంచి అదే ప్రాంతంలోని వివిధ బస్తీల్లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేపట్టారు. హిమాయత్ నగర్ డివిజన్ సీపీఐ అభ్యర్థి చాయాదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
గ్రేటర్‌లో ప్రశ్నించే గొంతుక కరవైంది: చాడ - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
బల్దియా ఎన్నికల్లో భాగంగా హిమాయత్ నగర్లో వామపక్ష నాయకులు ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రేటర్‌లో ప్రశ్నించే గొంతుక కరవైందని... ప్రశ్నించే గొంతుకనే గెలిపించాలని సూచించారు.
మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక బస్తీలు నీటమునిగాయని... తిండి లేక ఇంట్లో ఉన్న వస్తువులు పొగొట్టుకుని చాలామంది నిరాశ్రయులయ్యారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ డిమాండ్లతో తాము ప్రజల్లోకి వెళ్తున్నట్లు చాడ వివరించారు. ప్రజా నాట్యమండలి కళాకారులు డప్పుచప్పుళ్లతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి:తెరాస అభ్యర్థి తరఫున మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం