గురుదాస్ గుప్తా మృతి పట్ల సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పార్టీ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆయన మరణం సీపీఐకే కాదు దేశ రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే చురుకైన విద్యార్థి నాయకుడిగా గురుదాస్ గుప్తా పనిచేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. కార్మిక చట్టాల మార్పును అడ్డుకున్న వ్యక్తని కొనియాడారు.
'గురుదాస్ గుప్తా మృతి సీపీఐకి తీరనిలోటు' - gurudas gupta condolence meeting in telangana cpi office
ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై గురుదాస్ గుప్తా రాజీలేని పోరాటం చేశారని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.
!['గురుదాస్ గుప్తా మృతి సీపీఐకి తీరనిలోటు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4920675-thumbnail-3x2-cond.jpg)
గురుదాస్ గుప్తా మృతికి సీపీఐ నేతల సంతాపం
TAGGED:
Gurudas Dasgupta passes away