పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిర్బంధాల మధ్య సభలు నిర్వహించుకోవాల్సి వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సరూర్నగర్లో ఆర్టీసీ కార్మికుల సమరభేరి సభలో పాల్గొన్న చాడా... సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... ఆ గొంతును నులుమేస్తారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగం గురించి ఏ మాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చాడా డిమాండ్ చేశారు.
ప్రశ్నించే గొంతును నులిమేస్తారా..? చాడా వెంకట్రెడ్డి
ప్రజల ప్రాథమిక హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ సరూర్నగర్లో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన సమరభేరిలో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చాడా విమర్శలు గుప్పించారు.
CPI CHADA VENKATREDDY FIRE ON CM KCR IN RTC SAMARABHERI MEETING