కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేశారనడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. నిజంగా ట్యాపింగ్ జరిగితే దానిపై చర్య తీసుకునే అధికారం కేంద్రానికే ఉందన్నారు.
కిషన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారనడం విడ్డూరం : చాడ - హైదరాబాద్ తాజా వార్తలు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారనడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. దానిపై చర్య తీసుకునే అధికారం కేంద్రానికే ఉంటుందని తెలిపారు. సన్నవరికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చేందుకు సిద్ధపడితే, కేంద్రం అడ్డుపడడం రాజకీయ దురుద్దేశమేనని వెల్లడించారు.
![కిషన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారనడం విడ్డూరం : చాడ CPI Chada venkatreddy comments on kishnareddy for phone taping issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9563349-538-9563349-1605539864522.jpg)
కిషన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారనడం విడ్డూరం : చాడ
సన్నవరికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించేందుకు సిద్ధంగా ఉంటే, కేంద్రం మోకాలడ్డు పెట్టడం రాజకీయమే అవుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రానికి సహకరిస్తూ క్వింటాల్‌కు రూ.2500 ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల సన్న, చిన్నకారు రైతులకు ఉపశమనం కలుగుతుందని చాడ వెంకటరెడ్డి తెలిపారు.