ఆర్టీసీ కార్మికుల తరపున తాము పోరాటం చేస్తుంటే... రాజకీయం చేస్తున్నామని సీఎం కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. తన మాటనే నెగ్గాలనే భావనతో కేసీఆర్... ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ తయారు చేస్తామన్న కేసీఆర్... ఆర్టీసీ కార్మికుల పొట్టకొడుతున్నాడని మండిపడ్డారు. త్యాగాల తెలంగాణలో ఇప్పటికీ ఆత్మబలిదానాలు ఆగటం లేదని చాడ ఆవేదన వ్యక్తం చేశారు.
'న్యాయంవైపు నిలబడితే... విపక్షాలపై విషం కక్కుతున్నారు' - CPI CHADA VENKAT REDDY FIRE ON CM KCR ABOUT TSRTC STRIKE
పోరాడి సాధించుకున్న తెలంగాణాలో ఇప్పటికీ ఆత్మబలిదానాలు ఆగకపోవటం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆవేదన చెందారు. తన మాట నెగ్గించుకునేందుకు సీఎం కేసీఆర్... విపక్షాలపై విషం చల్లుతున్నారని మండిపడ్డారు.
CPI CHADA VENKAT REDDY FIRE ON CM KCR ABOUT TSRTC STRIKE