తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2021, 5:53 PM IST

ETV Bharat / state

దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: చాడ

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పీఎం మోదీకి ఎన్నికలపై ఉన్న దృష్టి ప్రజల ఆరోగ్యంపై లేదని విమర్శించారు. ఇతర దేశాలకు టీకాలు పంపించి కొరత సృష్టించారని మండిపడ్డారు.

chada venkat reddy fires on pm modi, cpi chada venkat reddy
కేంద్రంపై చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని చాడ డిమాండ్

కరోనా ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వైరస్ విజృంభణను అరికట్టాల్సిన ప్రధానమంత్రి... ఎన్నికలపై దృష్టి పట్టి తమ బాధ్యతను విస్మరించారని ఆరోపించారు. 6 కోట్లకు పైగా వ్యాక్సిన్​ను ఇతర దేశాలకు పంపించి... కొరత సృష్టించారని దుయ్యబట్టారు.

టీకా ధరలు నియంత్రించడం కాదు.. దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. రాష్ట్రాలకు ఆపన్నహస్తం అందించాలని కోరారు. కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ వెనకాడరు : మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details