తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2020, 5:49 PM IST

Updated : Jul 5, 2020, 6:54 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో తక్షణమే హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: చాడ వెంకట్​రెడ్డి

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వెంటనే హెల్త్​ ఎవర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు చేసుకోకుండా... ప్రజలకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని చాడ సూచించారు.

cpi chada venkat reddy demanded for health emergency
రాష్ట్రంలో తక్షణమే హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: చాడ వెంకట్​రెడ్డి

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి... యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా కేసులు తగ్గించేందుకు తీసుకునే చర్యలపై అఖిలపక్షంతో కేబినెట్​ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కరోనాను గాలికి వదిలేస్తే ఇంకా కేసులు పెరిగి ప్రాణనష్టం అధికమవుతుందని చాడా పేర్కొన్నారు.

ప్రగతిభవన్​లోనే 10 మందికి పాజిటివ్ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంద్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్​ ఆగడం లేదని... మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోల బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోలు ఇవ్వడాన్ని స్వాగతిస్తామన్న చాడా... అలాగే ఆర్థిక సాయం కూడా అందించాలని కోరారు. కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు చేసుకోకుండా... ప్రజలకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని చాడ హితవు పలికారు.

ఇవీ చూడండి:వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం!

Last Updated : Jul 5, 2020, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details