తెలంగాణ

telangana

ETV Bharat / state

సన్న వరికి గిట్టుబాటు ధర కల్పించాలి : చాడ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

రాష్ట్రంలో సన్న వరిపంట వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. క్వింటాలుకు 2500 రూపాయల మద్దతు ధర కల్పించి, దోమపోటుతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

CPI chada venkat reddy demamnds for paddy farmers in state
సన్న వరికి గిట్టుబాటు ధర కల్పించాలి : చాడ

By

Published : Nov 5, 2020, 7:13 PM IST

ప్రభుత్వం సూచించిన నియంత్రిత పంటల సాగు విధానం వల్ల సన్న వరిపంట వేసిన రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారని హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సన్న వరి ధాన్యానికి క్వింటాలుకు 2500 రూపాయల మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తెగుళ్ల బారిన పడి వందల ఎకరాల్లో పంటను దగ్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, దోమపోటు కారణంగా పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పరిహారం అందజేసి, ఆదుకోవాలని చాడ వెంకట్‌రెడ్డి కోరారు.

ఇదీ చూడండి:ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. దళారులను నమ్మొద్దు: పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details