తెలంగాణ

telangana

ETV Bharat / state

Chada venkat reddy: గొడవలు సృష్టించేందుకు భాజపా కుట్ర: సీపీఐ - తెలంగాణ వార్తలు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీపీఐ(cpi) రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి(chada venkat reddy) డిమాండ్ చేశారు. సెప్టెంబర్‌ 17ను అడ్డుపెట్టుకుని భాజపా(bjp) గొడవలు సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు.

Chada venkat reddy, chada allegations on bjp
చాడ వెంకట్ రెడ్డి, భాజపాపై చాడ ఆరోపణలు

By

Published : Sep 15, 2021, 11:13 AM IST

సెప్టెంబర్‌ 17ను అడ్డుపెట్టుకుని భాజపా(bjp) గొడవలు సృష్టించాలని చూస్తోందని సీపీఐ(cpi) రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి(chada venkat reddy) ఆరోపించారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

దళితబంధు(dalitha bandhu) రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చాడ వెంకట్‌రెడ్డి కోరారు. లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:Saidabad Rape Case: సైదాబాద్ హత్యాచారం కేసులో రంగంలోకి డీజీపీ

ABOUT THE AUTHOR

...view details