ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యపరుస్తూ.. ప్రజల భాషలతో పాటలు రాసిన ఉత్తమ కళాకారుడు ప్రసాదరావు అని చాడ పేర్కొన్నారు. ఆయన మరణం తీవ్ర మనోవేదనకు గురి చేసిందన బాధపడ్డారు.
'రెండు తెలుగు రాష్ట్రాలు మంచి కళాకారుడిని కోల్పోయాయి' - వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి వార్తలు
ప్రఖ్యాత వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంతాపం తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు.. మంచి కళాకారుడిని కోల్పోయాయన్నారు. ఆయన కుటుంబసభ్యులకు చాడ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
!['రెండు తెలుగు రాష్ట్రాలు మంచి కళాకారుడిని కోల్పోయాయి' condolences on vangapandu prasadrao death by cpi chada venkatreddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8288977-506-8288977-1596530558989.jpg)
వంగపండు మృతికి సంతాపం తెలిపిన చాడ వెంకట్ రెడ్డి
ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వంగపండు.. తన పాటలతో ఉత్తేజపరచారని చాడ గుర్తుచేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు.. మంచి కళాకారుడిని కోల్పోయాయని తెలిపారు.
ఇదీ చదవండిఃకరోనా నుంచి కోలుకున్నోళ్లే... కొండంత అండనిస్తున్నారు!