తెరాస ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అద్భుతాలు సృష్టించే విధంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రెవిన్యూ చట్టం అసమగ్రంగా ఉందని.. దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని కోరారు. ఈ చట్టాన్ని ప్రజల మధ్య పెట్టి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కొత్త రెవెన్యూ చట్టం అద్భుతాలు సృష్టించదు: చాడ వెంకట్‌రెడ్డి - కొత్త రెవెన్యూ చట్టంపై చాడ వెంకట్‌రెడ్డి అసంతృప్తి
తెరాస ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అద్భుతాలు సృష్టించే విధంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని ప్రజల మధ్య పెట్టి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీఆర్వో, వీఆర్‌ఏలను తొలగించడం ద్వారా గ్రామాలకు, తహసీల్దార్‌కు మధ్య సమన్వయం ఉండదన్నారు.
తహసీల్దార్‌కు కొన్ని అధికారాలు ఇచ్చినప్పటికీ వీఆర్వో, వీఆర్‌ఏలను తొలగించడం ద్వారా గ్రామాలకు, తహసీల్దార్‌కు మధ్య సమన్వయం ఉండదన్నారు. రాష్ట్రంలో భూసమగ్ర సర్వే చేయాలని... పూర్తి భూ సర్వే చేయకుండా ఈ చట్టం ఎలా పని చేస్తుందని ఆయన ప్రశ్నించారు. భూ రికార్డులను భద్రపర్చే వ్యవస్థ లేకుండా కేవలం ధరణి మాత్రమే అంటే ఇది అన్యాయమని చాడ మండిపడ్డారు. ఈ బిల్లుపై పూర్తిగా చర్చించి మరింత ప్రతిష్టంగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి:కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్