రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల అభ్యర్థులను వామపక్షాలు ప్రకటించాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి అభ్యర్థిగా ప్రొ.నాగేశ్వర్‌ను... వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థిగా జయసారథికి మద్ధతు ఇస్తున్నామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం సంయుక్తంగా వెల్లడించారు.
'నిరుద్యోగుల పక్షాన గళమెత్తిన వారికే మద్ధతు ఇచ్చాము'
సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రెండు ఎమ్మెల్సీ పట్ట భద్రుల నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. ప్రజలు, నిరుద్యోగుల పక్షాన గళమెత్తిన వారికే వామపక్షాలు మద్ధతునిచ్చాయని వెల్లడించారు.
హైదరాబాద్ ముగ్ధం భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు, నిరుద్యోగుల పక్షాన నిలిచి గళమెత్తిన వారికే వామపక్షాలు మద్ధతునిచ్చాయని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 16వ తేదీన, ఉమ్మడి వరంగల్లో 17వ తేదీన, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 18వ తేదీన వామపక్షాలు ప్రచారం చేస్తాయని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నుకున్న పెద్దలందరికీ జయసారథి కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగుల పక్షాన ఉండి ఎల్లప్పుడు తన గొంతు వినిపిస్తానని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి:'దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ తెరాసదే విజయం'