తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: సీపీఐ - to support farmers strike in delhi

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ధర్నా నిర్వహించారు. దిల్లీలో అన్నదాతల ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశపరచి నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

cpi aituc demands  New agricultural laws should be repealed immediately to support farmers strike in delhi
' నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలి'

By

Published : Dec 5, 2020, 7:11 PM IST

దిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్​లోని హిమాయత్​నగర్​లో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్​ విమర్శించారు. నూతన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 35 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. కేంద్రం వెంటనే పార్లమెంటును సమావేశపరచి చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస మద్దతుధరతో పాటు చట్టాలలో మార్పులను లిఖితపూర్వకంగా పొందుపరచాలని కర్షకులు కోరడం వారి పోరాట పటిమకు నిదర్శనమన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్నదాతల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి:రేవంత్, శ్రీధర్ ఎవరైనా ఓకే.. పోటీలో మాత్రం నేనున్నా: కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details