Cpget 2022: రాష్ట్రంలో ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం (సీపీగెట్-2022) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి జులై 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆలస్య రుసుము రూ.500లతో జులై 11 వరకు... రూ.2వేలతో జులై15 వరకు దరఖాస్తులను చేసుకోవచ్చని లింబాద్రి తెలిపారు. జులై 20 నుంచి ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు జరగనున్నట్లు చెప్పారు.
ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలను సీపీగెట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎనిమిది యూనివర్సిటీల పరిధిలోని 320 కాలేజీల్లో 50 కోర్సుల్లో.. 44,604 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.