కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్శిటీ విడుదల చేసింది. సీపీజీఈటీని రాష్ట్రవ్యాప్తంగా ఓయూ నిర్వహించనుంది. పీజీ కోర్సులు, పీజీ డిప్లొమా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఉస్మానియా యూనిర్శిటీ, జేఎన్‌టీయూ, కాకతీయ, తెలంగాణ, మహాత్మగాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాల్లో 2020-21కి ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
సీపీజీఈటీ 2020 షెడ్యూల్ విడుదల...
సీపీజీఈటీ 2020 షెడ్యూల్‌ను ఓయూ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష సమయం 80 నిమిషాలు అని స్పష్టం చేసింది. వివిధ విశ్వవిద్యాలయ్యాలో పీజీ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సుల 2020-21 ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
సీపీజీఈటీ 2020 షెడ్యూల్ విడుదల...
సీపీజీఈటీ 2020 పరీక్షలు డిసెంబర్ 2 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు ఓయూ ప్రకటించింది. ఈ పరీక్ష నిడివి 80 నిమిషాలు అని స్పష్టం చేసింది. ఎంఏ కన్నడ, మరాఠీ, పర్శియన్ అభ్యర్థులకు ఈ ప్రవేశ పరీక్షలు ఉండవని వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం tscpget.com సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి:23 నుంచి ఓయూ ఇంజినీరింగ్ పరీక్షలు