కార్గో, కొరియర్, పార్శిల్ ఆదాయం పెంచడంపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కృష్ణకాంత్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ఈడీ, ఇతర ఆర్టీసీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదాయం మరింత మెరుగుపర్చుకోవడంపై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
సీపీసీ ద్వారా ఆదాయం మెరుగు పడాలి: ఆర్టీసీ అధికారి కృష్ణకాంత్ - సీపీసీ ద్వారా తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం వివరాలు
కార్గో, కొరియర్, పార్శిల్ ఆదాయం పెంచడంపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్టీసీ సీపీసీ ప్రత్యేక అధికారి కృష్ణకాంత్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ఈడీ, ఇతర ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సీపీసీ ద్వారా ఆదాయం మెరుగు పడాలి: ఆర్టీసీ అధికారి కృష్ణకాంత్
ఈనెల 8వ తేదీ వరకు సీపీసీ సర్వీసులతో ఆర్టీసీకి రూ.1,57,74,598 ల ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు. ఇందులో కార్గో సర్వీసులతో రూ. 25,31,944 ఆదాయం, పార్శిల్, కొరియర్ సర్వీసులతో రూ.1,32,42,654 ఆదాయం వచ్చిందని వివరించారు.
ఇదీ చదవండి:ఏపీ సంస్థలు రిలీవ్ చేసినా తెలంగాణ చేర్చుకోలేదు'.. ఉద్యోగుల పిటిషన్