భారీ వర్షాలతో మహానగరంలో ప్రధాన రహదారులపై వర్షం నీళ్లు నిలిచే ప్రాంతాలను పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందంతో కలిసి పరిశీలించారు. నీళ్లు నిలవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లక్డీకపూల్‌లోని మెట్రో స్టేషన్ వద్ద మ్యాన్ హోల్ నుంచి నీళ్లు వెళ్లే పైపు చిన్నదిగా ఉండటం వల్ల వరద నీరు రహదారిపైనే ఉండిపోతుందని, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరుతున్నట్లు స్థానికులు సీపీ దృష్టికి తీసుకొచ్చారు. ట్యాంకుబండ్‌లో ఉన్న నీటిమట్టం కంటే దిగువన ఈ ప్రాంతం ఉండటం వల్ల వరద నీరు పైపుల నుంచి హుస్సేన్ సాగర్‌లో చేరడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు సీపీకి వివరించారు. రాజ్ భవన్ రహదారిలోని లేక్ వ్యూ అతిథిగృహం ఎదుట కూడా భారీగా వరద నీరు చేరి దిగువకు వెళ్లడం లేదని తెలిపారు. వీటికి శాశ్వత పరిష్కారం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని బృందానికి సీపీ అంజనీ కుమార్ సూచించారు.
'వర్షపు నీరు రహదారులపై ఉండకుండా శాశ్వత చర్యలు తీసుకోండి'
నగరంలో ప్రధాన రహదారులపై వర్షపు నీళ్లు నిలిచే ప్రాంతాలను సీపీ అంజనీ కుమార్ జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందంతో కలిసి పరిశీలించారు.
'వర్షపు నీరు రహదారులపై ఉండకుండా శాశ్వత చర్యలు తీసుకోండి'
TAGGED:
cp-visit