CP Srinivas Reddy Meeting With Officers in Hyderabad : ఒక్క నేరస్థుడికి శిక్ష పడితే నేరం చేయాలనుకునే 100 మందిలో భయం వస్తుందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేసే వారితో గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. వారి ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరపించాలని సూచించారు.
CP Srinivas Reddy Instructions to Officers: భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు కృషి చేయాలని సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన ప్రణాళిల(Plan For Control Traffic in Hyderabad)కు సిద్దం చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాలతో పాటు డ్రగ్స్ ఇతర నిషేధ వస్తువులు నగరంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న కేసులు దర్యాప్తు వేగంగా చేసి, నిందితులకు శిక్ష పడేలా చేయాలని విజ్ఞాప్తి చేశారు.
డ్రగ్స్ ముఠాలను సహించేది లేదు - పబ్స్ యజమానులు జాగ్రత్త ఉండాలి : హైదరాబాద్ సీపీ వార్నింగ్
Kothakota Srinivas Reddy Meeting With Police Force: సైబర్ నేరాల దర్యాప్తులో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని సీపీ హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను వినియోగించుకుని దర్యాప్తు మరింత వేగంగా చేసి రికవరీ రేటును పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనరేట్ పరిధిలోని ఇన్పెక్టర్లు పాల్గొన్నారు.