ఇసారి హైదరాబాద్‌లో ప్రజలందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తున్నారని సీపీ సజ్జనార్ అన్నారు. ప్రజలు బాగా సహకరిస్తున్నారని అభినందించారు. సైబారాబాద్ పరిధిలో దాదాపు 10వేల మందికి మాస్కులు లేని వారికి ఫైన్ విధించామని పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిధిలో లక్ష మందికి ఫైన్: సజ్జనార్ - ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి
కరోనా కట్టడిలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాత్రి వేళల్లో కర్ఫ్యూ ఏవిధంగా అమలవుతుంది ? మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్న వారిపై ఎన్ని జరిమానాలు విధించారు? తదితర అంశాలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
![హైదరాబాద్ పరిధిలో లక్ష మందికి ఫైన్: సజ్జనార్ Cyberabad CP Sajjanar, Cyberabad CP Sajjanar special interview](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11523238-14-11523238-1619263970469.jpg)
హైదరాబాద్ పరిధిలో లక్ష మందికి ఫైన్: సజ్జనార్
హైదరాబాద్‌లో మొత్తం దాదాపు లక్ష మందికిపైగా మాస్కులు లేని వారికి ఫైన్ విధించినట్లు వెల్లడించారు. గతంలో మొదటి సారి వెయ్యి మందికి పైగా పోలీసులకు కరోనా రాగా... సేకండ్ వేవ్‌లో ఇప్పడు సుమారు 120 మంది పోలీసులకు కొవిడ్ నిర్ధరణ అయిందని వివరించారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్ పరిధిలో లక్ష మందికి ఫైన్: సజ్జనార్
ఇదీ చూడండి :పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం : కేసీఆర్