తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సిన్ కనిపెట్టే వరకు జాగ్రత్తగా ఉండాలి: సీపీ సజ్జనార్​ - సీపీ సజ్జనార్​

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్​ల బారిన పడకుండా సులభంగా తట్టుకోవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్​ ట్రైనింగ్ సెంటర్​లో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.

CP Sajjanar latest news
CP Sajjanar latest news

By

Published : May 12, 2020, 5:12 PM IST

లాక్​డౌన్ విధుల్లో భాగంగా పోలీసులు నిరంతరం ప్రజలతో కలిసి పని చేయాల్సి ఉంటుందని సీపీ సజ్జనార్​ అన్నారు. ప్రజా రక్షణకు వివిధ కంటైన్మెంట్ జోన్​లలోనూ విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్​లో పని చేస్తున్న సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది పని చేసే స్థలంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆరోగ్య భద్రత ద్వారా చికిత్సలు చేసుకోవడానికి వీలుందన్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు సిబ్బందికి విటమిన్-సి మందులు, ఆమ్లా, డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నామన్నారు. కరోనా వైరస్​కు ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స లేదని.... వ్యాక్సిన్ కనిపెట్టే వరకు జాగ్రత్తగా ఉండటమే మన చేతిలో ఉందన్నారు. పోలీసులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఆహార, నిద్ర విషయాలలో సమయపాలన పాటించాలన్నారు. పోలీసు సిబ్బంది హెల్త్ ప్రొఫైల్, ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ, హెరిడిటీ వంటి వివరాలను పొందుపర్చడానికి ఒక అప్లికేషన్ రూపొందించాలని ఐటీ విభాగానికి సీపీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details