తెలంగాణ

telangana

ETV Bharat / state

Lockdown: మధ్యాహ్నం 2 గంటల లోపే ఇళ్లకు చేరుకోవాలి: సీపీ - లాక్డౌన్​పై సీపీ సజ్జనార్​

రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లాక్​డౌన్​ వెసులుబాటును సద్వినియోగం చేసుకొని ప్రజలంతా మధ్యాహ్నం 2 గంటల లోపే ఇళ్లకు చేరుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కోరారు. కూకట్‌పల్లి జేఎన్​టీయూ వద్ద లాక్​డౌన్​ అమలవుతోన్న తీరును ఆయన పరిశీలించారు. సరైన అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను హెచ్చరించారు.

cp sajjanar
లాక్​డౌన్​ వెసులుబాటు

By

Published : May 31, 2021, 6:04 PM IST

రాబోయే 10 రోజుల పాటు ప్రజలు ఇంటి వద్దనే ఉంటూ లాక్​డౌన్​కు సహకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో.. కూకట్‌పల్లి జేఎన్​టీయూ వద్ద లాక్​డౌన్​ అమలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును సద్వినియోగం చేసుకొని ప్రజలంతా మధ్యాహ్నం 2 గంటల లోపే ఇళ్లకు చేరుకోవాలని సజ్జనార్ కోరారు. సరైన అనుమతులు లేకుండా బయటకు రాకూడదని సూచించారు. అకారణంగా బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జీహెచ్​ఎంసీ పరిధిలోని పెట్రోల్ బంకులు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంటాయన్నారు. వ్యాక్సినేషన్ కోసం వెళ్లే వారు స్లాట్ బుకింగ్ కన్ఫర్మేషన్ చూపిస్తేనే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:Live video: డబ్బుల కోసం భార్యతో గొడవ... విద్యుత్​ వైర్లు పట్టుకొని భర్త మృతి

ABOUT THE AUTHOR

...view details