తెలంగాణ

telangana

ETV Bharat / state

అనవసరంగా బయటికి రావొద్దు : సజ్జనార్​

హైదరాబాద్​ నగరంలో లాక్​డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. పోలీసులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ లాక్​డౌన్​ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్​ సీపీ సజ్జనార్​.. నగరంలోని పలు చెక్​పోస్టులను పరిశీలించారు.

cp sajjanar observed the lock down in hyderabad
లాక్​డౌన్​ను పరిశీలించిన సీపీ సజ్జనార్​

By

Published : May 16, 2021, 3:26 PM IST

లాక్​డౌన్ దృష్ట్యా హైదరాబాద్​లోని సుచిత్ర, కొంపల్లి, అల్వాల్, ఆల్విన్ కాలనీల్లో ఏర్పాటు చేసిన చెక్​పోస్టులను సైబరాబాద్ సీపీ సజ్జనార్.. పరిశీలించారు. వాహనదారులను తనిఖీ చేసి సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై సీపీ కేసులు నమోదు చేశారు.

మేడ్చల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీకి గల కారణాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. వారంతా సరుకు రవాణా, అత్యవసర పనులపై వెళ్లే వాళ్లుగా గుర్తించిన అనంతరం వెళ్లడానికి అనుమతిస్తున్నారు. కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉందని ప్రజలందరూ ఇంట్లోనే ఉండి రక్షణ చర్యలు తీసుకోవాలని సజ్జనార్​ సూచించారు. తనిఖీల్లో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:జరిమానా వద్దు.. హెల్మెట్ ముద్దు.. అంటున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details